వెయిట్ లిఫ్టర్ దీక్షితకు సీఎం రూ.15 లక్షల బహుమతి

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ జూనియర్ ఛాంపియన్ షిప్ 58 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఎర్ర దీక్షితను సీఎం కేసీఆర్ అభినందించారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన దీక్షిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. దీక్షిత తన తల్లిదండ్రులు వినోద, కేశవరావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. దీక్షితకు ప్రోత్సాహకంగా రూ.15 లక్షల నగదు బహుమానాన్ని సీఎం ప్రకటించారు. దీక్షితకు శిక్షణ ఇచ్చిన కోచ్ పి.మాణిక్యాలరావుకు రూ.3 లక్షల నగదు బహుమతి ప్రకటించారు.

ఈ నెల 3 నుంచి 9 వరకు ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి.