వియత్నాం క్వార్టర్స్‌లోకి రుత్విక

మన రాష్ట్ర యువ క్రీడాకారిణి రుత్వికా శివాని వియత్నాం ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో టైటిల్ దిశగా దూసుకెళుతున్నది. ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక మహిళల సింగిల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్ చేరింది. ప్రీక్వార్టర్స్ పోరులో రుత్విక 21-15, 21-12తో చైనీస్ తైపీ షట్లర్ వాన్ యి తాంగ్‌పై విజయం సాధించింది. సెమీస్‌బెర్త్ కోసం ఇండోనేసియా షట్లర్ దినార్ డ్యా ఆస్టిన్‌తో రుత్విక తలపడనుంది.