విపక్షాలు అభివృద్ధి నిరోధకంగా మారాయి

రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకులపై ఎమ్మెల్యే శ్రీనివాస్‌  గౌడ్‌  తీవ్రంగా మండిపడ్డారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్‌ ఎస్‌ సర్కారుపై కాంగ్రెస్‌ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన..  ప్రభుత్వం చేపడుతున్న ప్రతీపనికి ప్రతిపక్ష నాయకులు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. సెక్రటేరియట్‌  నిర్మాణం విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ధి చెపుతారని శ్రీనివాస్‌ గౌడ్‌ హెచ్చరించారు.