వినియోగదారుల ఫోరంలో కేసులను తక్షణమే విచారణ

వినియోగదారుల ఫోరంలోని కేసులను తక్షణమే విచారించేందుకు కావాలసిన సౌకర్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వం కల్పించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. ఆయా ఉత్పత్తుల నాణ్యతపై పేదలు వేసిన కేసులను తక్షణమే పరిష్కరించినప్పుడు వారికి ఫోరంపై ఒక నమ్మకం కలుగుతుందన్నారు. ముఖ్యంగా ఫిర్యాదుదారుల ఉద్దేశ్యాలపై  జిల్లా, రాష్ట్ర ఫోరంలు దృష్టి పెట్టాలని ఈటెల సూచించారు. అప్పుడే చట్టం అబాసుపాలుకాకుండా ఉంటుందన్నారు. వినియోగదారుల ఫోరంఎదుర్కొంటునసవాళ్లపై నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈటెల పాల్గొన్నారు.