ఉత్తరాఖండ్ మంత్రి అత్యుత్సాహం

ఉత్తరాఖండ్ విద్యాశాఖ మంత్రి అరవింద్ పాండే అత్యుత్సాహం ప్రదర్శించి తీవ్ర అవమానం పాలయ్యారు. తనకు మ్యాథ్స్‌ సబ్జెక్‌ గురించి ఏమీ రాకపోయిన బిల్డప్‌ ఇచ్చారు. స్థానికంగా ఓ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి అరవింద్‌ పాండే…అక్కడి టీచర్‌ ను పలు ప్రశ్నలు అడిగారు. అందుకు ఆమె సరైన సమాధానం చెప్పినప్పటికీ… అది కాదంటూ దబాయించారు. మైనస్‌ ఒకటి ప్లస్‌ మైనస్‌ ఒకటి ఎంత మంత్రి ప్రశ్నించగా అందుకు టీచర్‌ మైనస్‌ రెండు అని సమాధానం చెప్పారు. అది కరెక్ట్ సమాధానం అయినప్పటికీ మంత్రి మాత్రం జీరో అని చెప్పటం అందరికీ నవ్వు తెప్పించింది. పైగా టీచర్‌ ను వారం రోజుల పాటు స్కూల్ కు రావద్దని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.