విడిపోయామంటే అంతే సంగతులు!

ప్రేమించుకొని విడిపోయిన జంటలు అనంతర కాలంలో సాధారణ స్నేహితులుగా వుండిపోగలరా? ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. బ్రిటీష్ సుందరి అమీజాక్సన్ మాత్రం ప్రేమికుల మధ్య బ్రేకప్ అయిపోతే వారు తిరిగి స్నేహితుల్లా వుండటం అసాధ్యమని తేల్చిచెప్పింది. కెరీర్ తొలినాళ్లలో ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు ప్రతీక్ బబ్బర్‌తో ప్రేమాయణాన్ని సాగించింది. కొంత కాలానికి మనస్పర్థలతో ఈ జంట విడిపోయారు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విఫల ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది అమీజాక్సన్. బ్రేకప్ జరిగిన తర్వాత మేమిద్దరం చాలా డిప్రెషన్‌కు గురయ్యాం. కొద్దిరోజుల తర్వాత తేరుకొని వృత్తి వ్యవహారాల్లో బిజీ అయిపోయాం. విడిపోయిన తర్వాత మేమిద్దరం ఒక్కసారి కూడా కలుసుకోలేదు. బ్రేకప్ జరిగిన తర్వాత ప్రేమికులు తిరిగి స్నేహాన్ని కొనసాగించకుండా వుండటమే మంచిది. ఒక్కసారి విడిపోయామంటే ఇక అంతే సంగతులు. మళ్లీ ఇద్దరు కలిసి స్నేహాన్ని కొనసాగించడం అర్థం లేని విషయం అని చెప్పుకొచ్చింది. అమీజాక్సన్  ప్రస్తుతం రజనీకాంత్ సరసన 2.0 చిత్రంలో నటిస్తున్నది.