విజ్ఞాన్ భవన్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ర్టాల ఉత్తమ ఉపాధ్యాయులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. తెలంగాణ నుంచి ఏడుగురు ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులను అందుకున్నారు. తెలంగాణకు సంబంధించి.. ప్రాథమిక పాఠశాల విభాగంలో నలుగురు ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాల విభాగంలో ముగ్గురు ఉపాధ్యాయులకు అవార్డులు వరించాయి. అవార్డుల ప్రదాన కార్యక్రమంలో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్, సహాయ మంత్రులు పాల్గొన్నారు.

తెలంగాణ నుంచి అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు:
-కిషన్ – పాత ఎల్లాపూర్(నిర్మల్ జిల్లా)
-జనార్ధన్ – మర్రిగూడ(నల్లగొండ జిల్లా)
-నారాయణ – పాల్కపల్లి(నాగర్‌కర్నూల్ జిల్లా)
-విజయలక్ష్మి – కులాస్‌పూర్(నిజామాబాద్ జిల్లా)
-రామారావు – ఏనుకూరు(ఖమ్మం జిల్లా)
-యోగేశ్వర్ – మంచిర్యాల
-సురేందర్ – జగిత్యాల