లీడ్ రోల్ చేస్తున్న అనసూయ!

బుల్లితెర‌పై వ్యాఖ్యాత‌గా అల‌రించిన అన‌సూయ క్ష‌ణం చిత్రంతో వెండితెర‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో అన‌సూయ కామియో రోల్ పోషించ‌గా, ఆమె న‌ట‌న‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక ఆ త‌ర్వాత సోగ్గాడే చిన్ని నాయ‌నా చిత్రంలోను మెరిసింది ఈ అమ్మ‌డు. రీసెంట్‌గా సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన విన్న‌ర్ మూవీలో స్పెష‌ల్ సాంగ్ చేసి యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేసింది హాట్ బ్యూటీ అను. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న రంగ‌స్థ‌లం 1985 చిత్రంలో ఓ స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ చేస్తుంది. అయితే తొలిసారి ఫీమేల్ లీడ్ పాత్ర‌లో అన‌సూయ స‌చ్చింది రా గొర్రె అని చిత్రం చేస్తుంది. ఈ మూవీ శ్రీధ‌ర్ రెడ్డి యార్వా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతుండ‌గా, క్రైమ్‌ కామెడీ జోనర్‌ లో చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఒగ్గు కథ స్టైల్‌ నేరేషన్‌తో ఈ మూవీ ఉంటుందని అన‌సూయ తెలిపింది. శ్రీనివాసరెడ్డి, రవిబాబు, టిల్లూ వేణు, రాకేష్‌, శివారెడ్డి, సత్యవతి, కోట శంకర్రావు ముఖ్యతారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సోహం రాక్‌స్టార్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ స్టూడియో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.