లియా అగర్‌బత్తీ అంబాసిడర్‌గా మిథాలీ

లియా అగర్‌బత్తీకి భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ను ఎన్‌ఆర్‌ గ్రూప్‌ ప్రచారకర్తగా నియమించుకుంది. మిథాలీ రాజ్‌తోపాటు ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించిన అరుణిమా సిన్హాను కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు తెలిపింది. ఖుష్బూ జో విశ్వాస్‌ జగాయే థీమ్‌తో వీరివురితో క్యాంపెయిన్‌ను నిర్వహించనున్నట్లు తెలిపింది. చారిత్రాత్మక విజయాలను సాధించిన ఇద్దరు మహిళలను ప్రచారకర్తలుగా నియమించుకోవటం సంస్థకు ఎంతో గర్వకారణంగా ఉందని సైకిల్‌ ప్యూర్‌ అగర్‌బత్తీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అర్జున్‌ ఎం రంగా తెలిపారు.