లాలూ కుమార్తె ఫాంహౌస్ జప్తు

మనీల్యాండరింగ్ కేసులో బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, అల్లుడు శైలేష్‌కుమార్‌కు చెందిన ఫాంహౌస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు జప్తు చేశారు. మనీల్యాండరింగ్(పీఎంఎల్‌ఏ) చట్టం కింద దక్షిణ ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో ఉన్న ఈ ఫాంహౌస్‌ను జప్తు చేశామని ఈడీ అధికారులు తెలిపారు. డొల్ల కంపెనీ ద్వారా నగదును అక్రమంగా బదిలీ చేశారని, ఇందులో భాగంగా ఫాంహౌస్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించామని తెలిపారు.