లారాకు తీవ్ర గాయాలు

విండీస్ మాజీ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా గాయాలపాలయ్యాడు. ఇంటిలోని స్టెయిర్ కేస్ నుంచి కిందపడడంతో అతడి మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తొడ, మోకాలు, కాలి మడమకు కట్లతో ఆసుపత్రిలోని బెడ్‌పై పడుకుంటూ అందులో కనిపించాడు. అయితే ప్రమాదంలో పెద్దగా గాయాలు కాలేదని, ఈ విషయంలో దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని తెలిపాడు