లండన్ మెట్రోరైలులో పేలుడు ఐసిస్ పనే

లండన్‌ భూగర్భ మెట్రోరైలులో బాంబు దాడికి తమదే బాధ్యత అని ఇస్టామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఇస్లామిక్‌ స్టేట్‌ కు చెందిన ఓ అనుబంధ సంస్థ మెట్రో రైలులో బాంబు దాడి చేసినట్లు తెలిపింది. ఐతే ఈ బాంబు దాడి కేసులో అనుమానితుడిగా భావిస్తున్న 18 ఏళ్ల యువకుడిని లండన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత లండన్ సమీపంలోని ఓ ఇంట్లో సోదాలు జరిపారు.

ఉగ్రవాద దాడి నేపథ్యంలో లండన్ నగరానికి తీవ్ర ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే నగరంలో హై అలర్ట్‌ ప్రకటించారు. మొదట్లో దీన్ని ప్రమాదంగా భావించినప్పటికీ.. అనంతరం లండన్, స్కాట్లాండ్‌ యార్డ్‌ పోలీసులు దీన్ని ఉగ్రవాదుల దాడిగా తేల్చారు.