రోడ్డు ప్రమాదంలో TBGKS ఉపాధ్యక్షుడి మృతి

సిద్దిపేట జిల్లా బెజ్జంకి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మిని బస్సు ఢీకొనడంతో ఒకరు చనిపోగా డ్రైవర్ తో పాటు 11 మంది సింగరేణి కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం కరీంనగర్ అపోలో అస్పత్రికి తరలించారు. ప్రమాదంలో చనిపోయిన రఘవీర్ రెడ్డి ప్రస్తుతం TBGKS ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింగరేణి కార్మికులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరామర్శించారు. రఘువీర్ రెడ్డి చనిపోవడం TBGKS కు తీరని లోటని ఎమ్మెల్యే గంగుల అన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే  ప్రగాడ సానుభూతి తెలిపారు.