రొహింగ్యాల సమస్య అతిపెద్ద సవాల్

రోహింగ్యాల సంక్షోభంపై స్పందించారు మయన్మార్ కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకీ. రోహింగ్యాల సమస్య మయన్మార్ కు అతిపెద్ద సవాలు అన్నారు. దీన్ని కేవలం 18 నెలల్లోనే పరిష్కరించాలనడం సరైంది కాదన్నారు. రోహింగ్యాల్లో ఉగ్రవాదులెవరో, సామాన్య ప్రజలెవరో గుర్తించాల్సి ఉందని సూకీ అభిప్రాయపడ్డారు. రఖైన్‌ రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాలుగా సామ్రాజ్యవాద బ్రిటిష్‌ పాలనకు ముందునుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉందన్నారు ఆంగ్ సాన్.