రైతు సమన్వయ సమితులు విప్లవాత్మక నిర్ణయం

రైతుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ సమన్వయ సమితులను ఏర్పాటు చేశారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇది విప్లవాత్మకమైన నిర్ణయమని చెప్పారు. రైతులకు కడుపు నిండా కరెంటు ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్ సర్కారుదేనని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో మంత్రులు కేటీఆర్‌, పోచారం, ఇతర నాయకులు పాల్గొన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకే సీఎం కేసీఆర్ సమన్వయ సమితులను ఏర్పాటు చేశారని పోచారం తెలిపారు.