రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పారు. అన్నదాతల ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో మంత్రి తుమ్మల, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ లాల్, జడ్పీ చైర్ పర్సన్ కవిత పర్యటించారు. నాచారం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను, ఏన్కూరు మార్కెట్ యార్డులో గోడౌన్, షాపింగ్ మాల్ ను ప్రారంభించారు.