రైతుల బాగు కోసమే భూరికార్డుల ప్రక్షాళన

రైతుల బాగు కోసమే సీఎం కేసీఆర్ భూరికార్డుల ప్రక్షాళనను చేపట్టారని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. అన్నదాతలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  మెదక్ జిల్లా రామాయంపేటలోని శివాయిపల్లిలో భూరికార్డుల ప్రక్షాళనను పద్మా దేవేందర్ రెడ్డి ప్రారంభించారు.