రైతుల తలరాతలు మార్చేందుకే సమన్వయ సమితులు

రైతుల తలరాతను మార్చేందుకే సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్ రెడ్డి చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తుంటే  ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు.. తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు.