రైతుల అభ్యున్నతి కోసమే సమితులు

రైతుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్‌ సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని మంత్రులు పోచారం, జూపల్లి కృష్ణారావు చెప్పారు. అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. వనపర్తిలో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో మంత్రులు పోచారం, జూపల్లితోపాటు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సుకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు. వికారాబాద్ జిల్లా పూడూరులో నిర్వహించిన అవగాహన సదస్సులో కూడా మంత్రి పోచారం పాల్గొని.. రైతులకు ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. అటు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, ఉప్పునూతల మండలాల రైతుల కోసం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు.

రైతు సమన్వయ సమితిల ఏర్పాటు దేశానికే ఆదర్శమన్నారు మంత్రి హరీశ్ రావు.  రైతులకు మద్దతు ధర లభించడంలో సమన్వయ సమితులది కీలక పాత్ర అని చెప్పారు. సంగారెడ్డిలో రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సుకు మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అటు మునిపల్లి, రాయికోడ్ మండలాల రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే బాబూ మోహన్‌ పాల్గొన్నారు. పటాన్‌ చెరు నియోజకవర్గంలో జరిగిన సదస్సుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హాజరయ్యారు. జహీరాబాద్ పట్టణంలో జరిగిన అవగాహన సదస్సులో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ పాల్గొన్నారు. అటు మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో రైతు సమన్వయ గ్రామ కమిటీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతు సమితులను ఏర్పాటు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.

అన్నదాతల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు మంత్రి ఈటెల రాజేందర్. కరీంనగర్‌ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో జరిగిన సమన్వయ సమితుల అవగాహన సదస్సుకు మంత్రి ఈటెల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్సీ నారదాసు, జడ్పీ చైర్‌ పర్సన్‌ తుల ఉమ, తదితరులు పాల్గొన్నారు. అటు, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పాల్గొన్నారు. సమన్వయ సమితుల స్వరూపంపై రైతులకు అవగాహన కల్పించారు.

అన్నదాతల అభ్యున్నతే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. రైతు శ్రేయస్సు కోసమే సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు. అటు సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో నిర్వహించిన అవగాహన సదస్సుకు సైతం మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ నర్సయ్య గౌడ్‌ హాజరు అయ్యారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇందులో పాల్గొన్నారు. సమన్వయ సమితి ఏర్పాటు, లక్ష్యాల గురించి రైతులకు అవగాహన కల్పించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్ళపల్లి, గుండాల మండలాల్లో  రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇందులో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లా ఇల్లందు, కామేపల్లిలో జరిగిన సదస్సులకు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. పాల్వంచ మండలం జగన్నాథపురంలో జరిగిన సదస్సులో ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పాల్గొని.. రైతులకు అవగాహన కల్పించారు. భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతు సమన్వయ సమితులతో అన్నదాతల కష్టాలన్నీ తీరుతాయని చెప్పారు.

అసంఘటితంగా ఉన్న రైతులను సంఘటితం చేయడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎంపీ సీతారాం నాయక్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లిలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌, ఇతర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అటు, హన్మకొండలో జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మేయర్‌ నరేందర్‌ పాల్గొన్నారు. వర్ధన్నపేటలో జరిగిన అవగాహన సదస్సుకు ఆరూరి హాజరయ్యారు. వరంగల్‌ లో నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్సీ కొండా మురళి, మేయర్‌ నరేందర్‌ పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు హాజరయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పుట్ట మధు పాల్గొన్నారు. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావు పేట మండల కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సుకు సివిల్‌ సప్లైస్ ఛైర్మెన్ పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు.

నిజామాబాద్‌ జిల్లా యేర్గట్లలో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో… మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్‌ లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్‌  రెడ్డి హాజరయ్యారు. మరోవైపు, బోధన్‌ లో జరిగిన సమన్వయ సమితుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే షకీల్ పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి రైతులకు వివరించారు. రైతు శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు.

రైతన్నల అభ్యున్నతికి టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండల కేంద్రంలో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉట్నూర్ లో జరిగిన సదస్సుకు ఎమ్మెల్యే రేఖా నాయక్‌ హాజరయ్యారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో.. గ్రామ, మండల, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. అటు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోనూ రైతు సమన్వయ కమిటీ సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సమన్వయ కమిటీల వల్ల.. ఇకపై పంటను పండించిన రైతులే ధరనూ నిర్ణయిస్తారని చెప్పారు.

మరోవైపు రైతు సమన్వయ సమితుల ఏర్పాటుతో ఊరూరా పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ రైతు బతుకులు బాగు చేసుకునేందుకు సంఘటితంగా కృషి చేస్తామంటూ ప్రతిన బూనారు. తమ మేలు కోరి సమన్వయ సమితులు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులంతా ధన్యవాదాలు తెలిపారు.