రైతులకు స్వర్ణయుగం రాబోతోంది

అన్నదాతలకు త్వరలోనే స్వర్ణయుగం రాబోతోందని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించడం ప్రపంచంలోనే విప్లవాత్మకమైన నిర్ణయం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకులో రైతు సహకార పరపతి సంఘాలకు ఆయన స్వైపింగ్ మెషిన్‌లు అందించారు.

తొలకరి జల్లుతో రైతు నేరుగా పొలంలోకి పోయేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుబడులను అందిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ పూర్తయితే పది సంవత్సరాలు కరువు వచ్చినా ఇబ్బందులు ఉండవని చెప్పారు. సొంత కుటుంబ వ్యవస్థలా చూసుకున్న సహకార సంఘాలు అద్భుత ఫలితాలు సాధించాయన్నారు.