రైతులకు వరంగా మారిన మిషన్ కాకతీయ

మిషన్ కాకతీయ .. కామారెడ్డి జిల్లా రైతులకు వరంగా మారింది. చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.  పూడికతీత పనులు పెద్ద ఎత్తున చేపట్టడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువులకు జలకళ వచ్చింది. దీంతో ఈసారి పంటలకు ఎలాంటి ఢోకా లేదని రైతులు చెబుతున్నారు. మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ కు మనసారా కృతజ్ఞతలు చెబుతున్నారు.