రేపే గూగుల్ తేజ్ రిలీజ్!

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. భారత్‌లో మొబైల్ చెల్లింపుల సేవలు ప్రారంభించబోతున్నది. ఇందుకోసం గూగుల్ తేజ్ పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను (యాప్) రూపొందించింది. ఈ యాప్‌ను సోమవారం నాడు (18న) కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖే స్వయంగా ప్రకటించింది. గూగుల్ సంస్థ యూనిఫైడ్ పేమెంట్ సర్వీస్ (యూపీఐ) అప్లికేషన్‌ను అభివృద్ధి చేసిందని, టెస్టింగ్ దశను కూడా పూర్తి చేసుకున్న ఈ యాప్ ఆర్బీఐ అనుమతి కోసం వేచిచూస్తున్నట్లు జూలైలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తెలిపింది.