రెస్టారెంట్ పై ఉగ్రవాదుల దాడి : 74 మంది మృతి

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మరోసారి రెచ్చిపోయింది. ఇరాక్ లో ఓ రెస్టారెంట్ పై కాల్పులు జరిపిన ఐసిస్ ఉగ్రవాదులు…74 మంది ప్రాణాలు పొట్టన బెట్టుకున్నారు. ఇరాక్ లోని దిఖర్ ప్రావిన్సు నసిరియా పట్టణంలో ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. అనంతరం సమీపంలోని చెక్ పోస్టుపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.  ఈ దాడిలో 74 మంది మృతి చెందగా, 90 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. ఐసిస్‌కు వ్యతిరేకంగా భద్రతాబలగాలతో కలిసి పోరాడుతున్న షియా సంస్థ హషీద్‌ అల్‌ షాబీ సభ్యుల రూపంలో ఉగ్రవాదులు చెక్‌పోస్ట్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి చేసింది తామేనని ఐసిస్‌ ప్రకటించింది.