రెండేళ్లలో 11 పెళ్లిలు చేసుకుంది!

రెండేళ్లలో 11 మందిని పెళ్లి చేసుకుంది. వారినుంచి కట్నం కూడా తీసుకుంది. థాయ్ సంప్రదాయం ప్రకారం అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలకు ఎదురు కట్నం ఇవ్వాలి.  అదే సంప్రదాయాన్ని పాటించింది ఈ అందాల భామ.  అందంతో ఆకర్షించి ఎదుటి వాటిని బుట్టలో పడేయడమే కాకుండా పెళ్లి అనే ముడితో బంధించి కట్నం రాబట్టేది.  రెండేళ్లుగా కొనసాగిస్తున్న ఈ తంతుకి పోలీసులు ముగింపు పలికారు.  గుట్టు రట్టయింది. భామ కటకటాల పాలైంది.   ఆమె పేరు జరియాపోర్న్ బుయాయి.  నచ్చిన యువకులతో పరిచయాలు పెంచుకుని వారిని బుట్టలో పడేసేది. తన మీద బాగా నమ్మకం కలిగించి పెళ్లి చేసుకోమనేది. థాయ్ సంప్రదాయం ప్రకారం ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునేవారు.  అలా ఈ రెండేళ్లలో 11 మందిని పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. ఆగస్టు నెలలోనే నలుగుర్ని పెళ్లాడిందట.  ఇటీవల ఆమె గురించి ఫేస్‌బుక్‌లో ‘రన్నింగ్ బ్రైడ్’ అంటూ ఓ పోస్ట్ కూడా వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే తానెవర్నీ మోసం చేయలేదంటోంది ఈ థాయ్ అమ్మడు.