రూటు మార్చిన చైనా

చైనా మాట మార్చింది. ఎప్పుడు భారత్‌ ను టార్గేట్  చేస్తూ రెచ్చగొట్టే డ్రాగన్  కంట్రీ..అనూహ్యాంగా రూటు మార్చింది. గతాన్ని మరిచి  ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించింది. ఇరు దేశాలు సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయన్నారు చైనా రాయబారి. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బ్రిక్స్‌ సదస్సులో  జిన్‌పింగ్‌, ప్రధాని మోడీ ప్రకటనలను గుర్తు చేశారు. పాత పేజీలను మూసేసి.. కొత్త అధ్యాయాన్ని ప్రారంభించామన్నారు. భారత్‌  కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామని, అంతర్జాతీయ, ప్రాంతీయ వ్యవహారాల విషయంలో ద్వైపాక్షిక చర్చల ద్వారా పురోగతి సాధించాని చెప్పారు.