రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

తెలంగాణలో వానలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఒడిశా నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి కారణంగా వానలు పడుతున్నాయి. అల్పపీడన ద్రోణికి తోడు… ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్, సికింద్రాబాద్‌లో పలు చోట్ల వర్షం పడింది. మారేడ్‌ పల్లి, బోయిన్‌ పల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్‌, చిలకలగూడ, సీతాఫల్‌ మండిలో కుంభవృష్టి కురిసింది. ముషీరాబాద్, అంబర్‌ పేట, దిల్ సుఖ్‌ నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురంలో వాన పడింది. తార్నాక, ఉప్పల్, నాచారం, రామాంతపూర్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ లో సహా పలు ప్రాంతాల్లో వాన కురిసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, బండ్లగూడ, కిస్మత్ పురా, హిమాయత్ సాగర్‌ లో వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాన పడింది. స్టేషన్‌ ఘన్‌ పూర్‌, రఘునాథపల్లి, ధర్మసాగర్‌, వేలేరు, మహబూబాబాద్‌, కేసముద్రం, నెల్లికుదురు, జనగామ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.

అటు, కరీంనగర్‌ జిల్లా కేశవపట్నం, సైదాపూర్‌, హుజురాబాద్‌, చొప్పదండి, రామడుగు, గంగాధర, తిమ్మాపూర్‌, మానకొండూర్‌ లో వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల, వేములవాడ తదితర ప్రాంతాల్లో వాన పడింది. ఖమ్మం జిల్లా చింతకాని, బోనకల్‌, మధిర, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెంలో చిరుజల్లులు కురిశాయి. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి, నర్సన్నపేట, జగదేవ్‌ పూర్‌ లో వాన పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, ఇల్లందులో కుంభవృష్టి కురిసింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మోస్తరు వర్షం పడింది. నల్లగొండ జిల్లా చిట్యాల, నార్కెట్‌ పల్లిలో వాన కురిసింది. అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనం కారణంగా … 19, 20వ తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.