రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమితుల సందడి

అన్నదాతలను సంఘటితం చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం శరవేగంగా అమలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమన్వయ సమితుల ఏర్పాటు జోరుగా సాగుతోంది. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఊరూరా తిరుగుతూ రైతులను చైతన్యపరుస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో జరిగిన రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్ పాల్గొన్నారు.

అటు గోదావరిఖనిలో జరిగిన అవగాహన సదస్సులో మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. పాలకుర్తి, రామగుండం, అంతర్గాం మండలాలకు సంబంధించిన రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పుట్టు మధు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు, ఆర్టీసీ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ హాజరయ్యారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మీ పాల్గొన్నారు. భూ సమగ్ర సర్వేకు రైతులంతా సహకరించాలని మంత్రి పోచారం కోరారు. అనంతరం మంచిర్యాల జిల్లా కోటపల్లిలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్ తదితరులు హాజరయ్యారు.

అటు నిజామాబాద్ జిల్లా డిచ్‌ పల్లిలో రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సు జరిగింది. మంత్రులు పోచారం, జోగు రామన్న, ఎంపీ సుమన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ గంగాధర్‌ గౌడ్‌ ఇందులో పాల్గొన్నారు.

ఇక వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ అంబేద్కర్ భవన్‌లో జరిగిన రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, చెన్నమనేని రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌లో జరిగిన రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. తర్వాత మిర్యాల గూడలో జరిగిన అవగాహన సదస్సుకు వారు హాజరయ్యారు.

వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో జరిగిన రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సుకు మంత్రి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో రైతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అటు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో జరిగిన అవగాహన సదస్సుకు మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. రైతు సమన్వయ సమితి ఏర్పాటు ఆవశ్యకతను అన్నదాతలకు వివరించారు. తర్వాత వనపర్తి జిల్లా కొత్త కోట గ్రామంలో రైతు కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఖమ్మం జిల్లాలోనూ రైతు సమన్వయ సమితుల ఏర్పాటు జోరుగా సాగుతోంది. వైరాలో జరిగిన అవగాహన సదస్సులో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే మదన్ లాల్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు. అటు రఘునాథ పాలెంలో జరిగిన రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హాజరయ్యారు. రైతు సమన్వయ సమితి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

నిర్మల్‌ జిల్లా బాసరలో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. అటు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రైతు సమన్వయ సమితి సభ్యుల సమావేశం నిర్వహించారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరోవైపు, ఇంద్రవెల్లి మండల కేంద్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే రేఖాశ్యాం నాయక్‌ ఇందులో పాల్గొన్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా అర్సనపల్లిలో జరిగిన అవగాహన సదస్సులో ఎంపీ సీతారాం నాయక్‌, సివిల్‌ సప్లైస్  చైర్మన్‌  పెద్ది సుదర్శన్‌ రెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురులో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ హాజరయ్యారు. మరోవైపు, డోర్నకల్ లో రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన నిర్వహించారు. ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అటు, జనగామలో జరిగిన సదస్సులో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మండలి విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో జరిగిన రైతు సమన్వయ సమితి సభ్యుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌ రెడ్డి తదితరులు భాగస్వాములయ్యారు. మరోవైపు, జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన సదస్సుకు ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే హాజరయ్యారు.

ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో రైతు సమన్వయ సమితుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చౌటుప్పల్, నారాయణపురం మండలాల రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారు.

అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్ పల్లి మండల కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ పాల్గొన్నారు. గ్రామ స్థాయి, మండల స్థాయి రైతు సమన్వయ సమితుల సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.