రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. బతుకమ్మ, దసరా పండుగలు నెలాఖరున, మొహర్రం అక్టోబర్ 1న వస్తున్నందున ఈ నెల 25నే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డి.ఎ.ను కూడా విడుదల చేయాలని చెప్పారు.

25నే జీతాలు చెల్లించాలని, ఈ సంవత్సరానికి మొదటి కిస్తు డి.ఎ. (3.668) చెల్లించాలని టిఎన్జీవోల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్ రెడ్డి, మామిళ్ల రాజెందర్, టిజీవోల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. ముఖ్యమంత్రి ఈ వినతి పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ నెల 25నే వేతనాలు చెల్లించాలని, వీలైనంత త్వరలో మొదటి కిస్తు డిఎ చెల్లించాలని ఆదేశించారు.