రాష్ట్రపతి, ప్రధాని బక్రీద్ శుభాకాంక్షలు  

దేశ వ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశంలోని ముస్లిం లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోడీ ట్విట్టర్ లో బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావంతో సామరస్యంగా, సమైక్యంగా ఉండాలని మోడీ పిలుపునిచ్చారు. అటు దేశ వ్యాప్తంగా ఈద్గాల దగ్గర ముస్లింలు నమాజ్ చేస్తున్నారు.