రాజస్థాన్ డ్రగ్స్ ముఠా అరెస్ట్

హైదరాబాద్ లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు. నగర శివార్లలో విస్తరిస్తున్న ముఠా కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. మియాపూర్, మక్తా లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్న రాజస్థాన్ కు చెందిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.