రాజకీయ లబ్ధికే బీజేపీ యాగీ

రాజకీయంగా లబ్ధి పొందేందుకే బీజేపీ నేతలు తెలంగాణ విమోచన దినం పేరుతో నానా యాగీ చేస్తున్నారని ఎస్సీ కార్పోరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నేపథ్యంలో సెప్టెంబర్‌ 17న ఉత్సవాలు నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ ఇచ్చిన హామీలను ముందుగా నెరవేర్చాలని పిడమర్తి రవి హితవు పలికారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.