రజకుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

చాకలి ఐలమ్మ ఆశయాలకు అనుకూలంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి. హైదరాబాద్‌  లోయర్ ట్యాంక్ బండ్ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్థంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజక కులస్తుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.