రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిర్మలా

రక్షణ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ, మంత్రి పొన్ను రాధాకృష్ణన్ తో పాటూ పలువురు అధికారులు హాజరయ్యారు. తనపై నమ్మకం ఉంచి రక్షణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. సాయుధ బలగాల సంక్షేమం కోసం కృషి చేస్తానని, దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం కనుగొంటానని చెప్పారు. ఆదివారం జరిగిన కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ప్రధాని మోడీ ఆమెకు కేబినెట్ హోదా కల్పించడంతో పాటూ రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇందిరా గాంధీ తర్వాత రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు.