యూరోప్ బతుకమ్మ సంబురాల పోస్టర్ రిలీజ్

యూరోప్ లో  జాగృతి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ మేరకు యూరోప్ లో నిర్వహించనున్న బతుకమ్మ సంబురాల పోస్టర్ ను విడుదల చేశారు జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శులు  రోహిత్ రావు, మర్పడగ కృష్ణా రెడ్డి, యూత్ కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్జాగృతి పిఆర్వో సంతోష్ , నందికొండ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.   నెల 23  డెన్మార్క్ లో ని  కోపెన్ హెగెన్  నగరంలో బతుకమ్మ సంబరాలు జరుగుతాయని కవిత తెలిపారు30 ఐర్లాండ్ దేశం లోని డబ్లిన్ నగరంలో అక్టోబర్ 1 స్విట్జర్లాండ్ లో ETH Zurich యూనివర్సిటీ లో తెలంగాణ జాగృతి బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నదని చెప్పారు. సందర్భంగా ఎంపీ కవిత డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఐర్లాండ్ దేశాలలోని మహిళ లకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.