యూఎస్ ఓపెన్ టైటిల్ విజేత ర‌ఫెల్ నాద‌ల్

యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత‌గా ర‌ఫెల్ నాద‌ల్ నిలిచాడు. ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ కెవిన్ అండ‌ర్సన్ పై ఫైన‌ల్ లో వ‌రుస సెట్ల‌తో విజయం సాధించారు. 6-3, 6-3, 6-4 తేడాతో అండ‌ర్స‌న్ పై నాద‌ల్ గెలుపొందాడు. నాద‌ల్ కెరీర్ లో ఇది 16 వ గ్రాండ్ స్లామ్ టైటిల్. ఇదివ‌ర‌కు 2010, 2013 లో యూఎస్ ఓపెన్ టైటిల్స్ సొంతం చేసుకున్న ర‌ఫెల్ నాద‌ల్ కు ఇది మూడో టైటిల్.