యుమునా నదిలో పడవ బోల్తా

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది.  భాగపత్ జిల్లాలో యమునా నదిలో పడవ బోల్తా పడి 15 మంది మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో పడవలో 60 మంది ఉన్నారు. కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం….సహాయక చర్యలు నిర్వహిస్తోంది.