మోడీ బర్త్ సందర్భంగా సేవాదివస్‌!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ  67వ వసంతంలోకి అడుగిడారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా సేవాదివస్‌ను పాటిస్తున్నది. వైద్య శిబిరాల ఏర్పాటు, రక్తదానాలు, పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపట్టింది. ఈ సేవా దివస్‌లో భాగంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాంచీలో, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలోని కీర్తినగర్‌లో, రైల్వేమంత్రి పీయూష్ గోయల్ చెన్నైలో, హెఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ముంబైలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ప్రధాని మోడీ ఇవాళ గుజరాత్ పర్యటనలో ఉన్నారు. సర్దార్ సరోవర్ డ్యామ్‌ను ప్రధాని నేడు ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. అదేవిధంగా స్థానికంగా జరిగే పలు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.