ముగిసిన వరంగల్ స్పోర్ట్స్ ఫెస్టివల్

హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నాలుగు రోజుల పాటు జరిగిన వరంగల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ముగిసింది. ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, కలెక్టర్ ఆమ్రపాలి, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, వరంగల్ జిల్లా స్పోర్ట్స్ అధికారులు పాల్గొన్నారు. క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.