ముగిసిన రుత్వికా పోరాటం

వియత్నాం ఓపెన్‌ గ్రాండ్‌ ప్రీలో గద్దె రుత్వికా శివాని, లక్ష్యసేన్‌ పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌ ఫైనల్లో అన్‌సీడెడ్‌ శివాని 21-18, 15-21, 8-21తో మూడో సీడ్‌ దినార్‌ దైహ్‌ అయుస్టినె (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ 17-21, 23-21, 10-21తో కొడై నరౌక (జపాన్‌) చేతిలో పోరాడి ఓడాడు.