మిషన్‌ భగీరథ అత్యద్భుతమైన పథకం

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌  భగీరథ అత్యద్భుతమైన పథకమని బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ కుమార్‌ మోడీ ప్రశంసించారు. శివుని జటాఝూటం నుంచి గంగమ్మను దివి నుంచి భువికి తీసుకొచ్చి భగీరథ ప్రతయ్నంతో  ఇది  సమానమని కొనియాడారు. 47 వేల కోట్ల వ్యయంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు సర్కారు చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. మిషన్‌ భగీరథలో భాగంగా పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతున్నారని… అలాంటివి బీహార్‌ లో తానేప్పుడూ చూడలేదని చెప్పారు. ఇంతటి మహత్తర పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. సిద్దిపేట జిల్లా కోమటిబండ దగ్గర మిషన్‌ భగీరథ పంపు హౌజ్‌ లను సుశీల్‌ కుమార్‌ మోడీ పరిశీలించారు. సీఎస్‌ ఎస్పీ సింగ్‌ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.