మా ప్రేమ బ్రేక్ అప్ అయ్యింది!

ప్రేమ వ్యవహారాల గురించి బాహాటంగా స్పందించడానికి మన కథానాయికలు సంశయిస్తారు. ఒకవేళ ప్రేమలోవున్నప్పటికి అలాంటిదేమి లేదంటూ సమాధానాన్ని దాటవేయడానికి ప్రయత్నిస్తారు. అయితే చెన్నై సోయగం రెజీనా మాత్రం అందుకు భిన్నంగా తన లవ్‌ఎఫైర్‌పై ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. ఒకప్పుడు తాను ప్రేమలో వున్నానని…అనుకోని కారణాల వల్ల ఆ బంధం విచ్ఛిన్నమైందని చెప్పింది. అయితే ప్రియుడి పేరును చెప్పడానికి మాత్రం నిరాకరించింది. “గత కొన్నేళ్ల జీవితం నాకెన్నో పాఠాల్ని నేర్పింది. ఆ ఒత్తిళ్ల నుంచి బయటపడి ఇప్పుడు సరికొత్త స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. మరికొన్నేళ్ల వరకు ఒంటరిగానే వుండాలని నిర్ణయించుకున్నాను. ఈలోపు నన్ను నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను” అని రెజీనా చెప్పింది. ఈ ఈమె వ్యాఖ్యలు చెన్నై సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం తమిళంలో మూడు చిత్రాల్లో, తెలుగులో హరేరామ హరే కృష్ణ సినిమాలో రెజీనా హీరోయిన్ గా నటిస్తున్నది.