మార్కెట్లోకి లెనోవో కొత్త ఫోన్

ప్రముఖ ఎలక్ట్రానిక్ఉత్పత్తుల సంస్థ లెనోవో మార్కెట్లోకి తాజాగా మరో డ్యూయల్కెమేరా స్మార్ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. సంస్థ తన కేసిరీస్లో ఫోన్ను ఆవిష్క రించింది. కే-8 ప్లస్పేరిట విడుదల చేసిన ఫోన్ధర రూ.10,999గా కంపెనీ నిర్ణయించింది. గూగుల్అండ్రాయిడ్నౌగట్ఆపరేటింగ్సిస్టమ్తో పని చేసే స్మార్ట్ఫోన్‌ 5.2 అంగుళాల తాకే తెర, హెలియో పీ25 ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీతో పాటు 128 జీబీ వరకు మెమోరీని విస్తరించుకొనే వెసులుబాటుతో లభించనుంది. అలాగే డ్యూయల్కెమేరాతో లభించే ఫోను వెనుక వైపు 13 ఎంపీ సామర్థ్యపు కెమేరాతోను.. 5 ఎంపీ సామర్థ్యపు కెమెరాతోను లభించనుంది. ముందు 8 ఎంపీ సెల్ఫీ కెమేరాతో ఆవిష్కరించింది. 4,000 ఎంఏహెచ్బ్యాటరీ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. ఫ్లిప్కార్ట్లో ఫోన్లను విక్రయించనున్నట్లు సంస్థ తెలిపింది.