మార్కెట్లోకి మరో రెండు ఇన్‌ఫోకస్ ఫోన్లు

అమెరికాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌పోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫోకస్ మరో రెండు మోడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిలో రూ.8,999 విలువైన టర్బో 5 ప్లస్ కాగా, మరొకటి రూ.11,999 ధర కలిగిన స్నాప్ 4లు ఉన్నాయి. ఈ నెల చివరి వారం నుంచి ఆన్‌లైజ్ దిగ్గజం అమెజాన్ వెబ్‌సైట్లో ఈ మొబైళ్లు లభించనున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 5.2 అంగుళాల టచ్‌స్క్రీన్ కలిగిన స్నాప్ 4లో 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ(128 జీబీ వరకు పెంచుకోవచ్చును), వెనుకవైపు 13 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ రెండు కెమెరాలు, ముందుభాగంలో కూడా రెండు 8 మెగాపిక్సెల్ కెమెరాలు, 4850 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.  టర్బో 5 ప్లస్‌లో 5.5 అంగుళాల టచ్‌స్క్రీన్, 3జీబీ ర్యామ్, 32 జీబీ మెమొరీ(64 జీబీ వరకు పెంచుకోవచ్చును), 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, ముందుభాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా, 4850 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.