మార్కెటింగ్‌ శాఖలో అక్రమార్కులకు చెక్‌

అదిలాబాద్ జిల్లాలో పత్తి క్రయ విక్రమాల్లో తలెత్తున్న సమస్యలకు చెక్‌ పెట్టనుంది ప్రభుత్వం అందుకోసం ఈ ఏడాది నుంచి రైతులకు బార్ కోడ్ గుర్తింపు కార్డులను అందించడానికి మార్కెటింగ్ శాఖ సిద్ధమవుతోంది. అధికారులు ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. ఈ విధానం పాతదైనా ఈ సారి మాత్రం ఆన్‌లైన్ అనుసంధానించి బార్ కోడ్ అందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం వ్యవసాయశాఖ చేపట్టిన సమగ్ర సర్వే వివరాలను సేకరిస్తున్నారు.

రైతుల వారీగా భూ విస్తీర్ణం ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్ తదితర వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలతో కార్డులు జారీ చేయనున్నారు. జిల్లాలో పత్తి 1.20 లక్షల ఎకరాల్లో సాగులోకి వచ్చింది. ఈ ఏడాది కేంద్రం పత్తికి మద్దతు ధర 4320 రూపాయలుగా ప్రకటించింది. మరో నెల రోజుల్లో పత్తి ఉత్పత్తులు మార్కెట్‌లోకి రానున్నాయి. అయితే ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్‌లో పత్తికి ధర తగ్గిన సందర్భాల్లో రైతుల కష్టాల వర్ణనాతీతం. వ్యాపారులు నిర్ణయించిన ధరకే ఉత్పత్తులను విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.  అయితే రైతుల వద్ద అతి తక్కువ ధరకు పత్తిని కొ నుగోలు చేసిన వ్యాపారులు… తిరిగి రైతుల అవతారం ఎత్తి సీసీఐకి విక్రయిస్తూ భారీగా లాభాలు పొందుతున్నారు. ఏటా ఇలాంటి సంఘటనలు కోకోల్లలుగా  జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇలాంటి అక్రమాలు జరగకుండా  రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. ఇటీవలే వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన రైతు సమగ్ర సర్వే వివరాలను మార్కెటింగ్ శాఖ అధికారు లు సేకరిస్తున్నారు. రైతుకు ఎంత భూమి ఉంది? ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు. అందులో పత్తి ఎన్ని ఎకరాల్లో సాగు అయ్యింది లాంటి వివరాలను ఆన్‌లైన్‌లో క్రోడీకరిస్తున్నారు. ఈ వివరాల ఆధారంగా  ప్రతి రైతుకూ కార్డులు ఇచ్చి దానిపై బార్‌కోడ్ వేస్తున్నారు. పత్తి ఉత్పుత్తులను మార్కెట్‌కు తీసుకరాగానే బార్‌కోడ్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే ఆ రైతు సమగ్ర సమాచారం తెలిసి పోతుందని అధికారులు తెలిపారు. ఈ నూతన విధానంతో అక్రమాలకు చెక్ పడుతుందని… దళారీ వ్యవస్థ నశిస్తుందని అధికారులు తెలిపారు.ప్రభుత్వ నిర్ణయంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి టెక్నాలజీ ఉపయోగంతో తమకు న్యాయం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల అభివృద్దికి అన్ని విధాలా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞతలుత్వరలోనే రైతులందరికీ కార్డులు పంపిణీ చేస్తామన్నారు మార్కెటింగ్‌ అధికారులు. వ్యవసాయశాఖ సమగ్ర సర్వే ఆధారంగా ఈ కార్డుల పంపిణీ జరుగుతుందని.. అందువల్ల నిజమైన రైతులకు న్యాయం జరుగుతుందన్నారు.