మానవ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి ఉగ్రవాదం

మానవ అభివృద్ధికి ఉగ్రవాదం ప్రధాన అడ్డంకిగా మారిందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఉగ్రవాద నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అటు దేశచరిత్రలో న్యాయవ్యవస్థకు గొప్ప స్థానం ఉందన్నారు వెంకయ్య నాయుడు. రంగారెడ్డి జిల్లాలోని నల్సార్‌ వర్సిటీలో జరిగిన అంతర్జాతీయ న్యాయసంస్థ సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ నరసింహన్‌, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు.