మాకేం సమాచారం లేదు!

కేంద్ర మంత్రివర్గంలో జేడీయూ చేరుతుందనే వార్తలను ఖండించారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. మంత్రివర్గ విస్తరణపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని, తాను మీడియాలోనే చూస్తున్నానని అన్నారు. ఈ అంశం గురించి బీజేపీతో ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఒకవేళ బీజేపీ నుంచి ఆహ్వానం వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు నితీశ్.

ఇప్పటి వరకు జేడీయూకు రెండు కేబినెట్ పదవులు, ఒక సహాయ మంత్రి హోదా ఖాయమని వార్తలు వచ్చాయి. రేపు ఉదయం 10 గంటలకే కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ ఉండగా.. నితీశ్ ప్రకటనతో కేబినెట్ లో జేడీయూ చేరికపై సస్పెన్స్ నెలకొంది.