మల్లయోధుడిగా మారిన బ్రెట్ లీ

క్రికెట్ మైదానంలో వేగవంతమైన బంతులతో బ్యాట్స్ మెన్ ని హడలెత్తించే బ్రెట్ లీ ఒక్కసారిగా రెజ్లింగ్ గ్రౌండ్ లోకి దిగాడు. టీ షర్ట్ తో కదన రంగంలోకి దిగిన ఆయన మల్లయోధులని ఓడించి వారిపై గెలిచినంత బిల్డప్ ఇచ్చాడు. మరి ఇదంతా రియల్ గా జరిగిందా, లేక రీల్ కోసం చేశారా అనేదే కదా మీ డౌట్.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ ఏడాదిలో కొన్ని రోజుల పాటు ఇండియాలో పర్యటిస్తుంటాడు. తాజాగా కర్ణాటకకు వచ్చాడు. అక్కడ జరుగుతున్న ప్రీమియర్ రెజ్లింగ్ లీగ్ కి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు. రెజ్లర్స్ ప్రాక్టీస్ చేసే అఖాడాకి వెళ్ళి వారితో సరదాగా కాసేపు మల్లయుద్ధం చేశాడు. బ్రెట్ లీ లాంటి క్రికెటర్ తమ దగ్గరికి వచ్చి ఇలా సరదాగా ఆడుతుండడంతో రెజ్లర్స్ కూడా తమ జోరు తగ్గించి, సహకరించారు.