మరో రెండు రోజులు వర్షసూచన

మహారాష్ట్రలోని విదర్భ మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో రాత్రి సాధారణం నుంచి మోస్తరు వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం నుంచి వానలు పడ్డాయి. రానున్న 48 గంటల్లో గ్రేటర్ పరిధిలో సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.