హైడ్రోజన్ బాంబు పరీక్షించిన నార్త్‌ కొరియా

నార్త్‌  కొరియా మరోసారి కవ్వింపు చర్యకు దిగింది. ఐక్యరాజ్యసమితి వారించినా.. వినకుండా  హైడ్రోజన్  బాంబును పరీక్షించింది. దాంతో సున్‌గ్జిబేగమ్‌  ప్రాంతంలో ఒక్కసారిగా భూ ప్రకంపణలు వచ్చాయి. రికార్టు స్కేలుపై 6.4 తీవ్రత నమోదైంది. దాంతో అణు పరీక్షను నిర్వహించినట్లు.. సౌత్  కొరియా,  జపాన్‌  లు ఆరోపించాయి.  దీనిపై స్పందించిన నార్త్‌  కొరియా… హైడ్రోజన్  బాంబును పరీక్షించినట్లు అధికారికంగా ప్రకటించింది. లాంగ్   రేంజ్  మిస్సైల్స్‌   లోనూ ఈ హైడ్రోజన్  బాంబును లోడ్  చేయోచ్చని  తెల్పింది. కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాల మేర‌కే ఈ హైడ్రోజన్  బాంబును పరీక్షించినట్లు అక్కడి మీడియా ప్రకటించింది.