మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి

మత్స్యకారుల అభివృద్దికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారన్నారు దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక పెద్దచెరువులో ఆయన చేప పిల్లలు వదిలారు. సీఎం కేసీఆర్‌ కుల వృత్తుల పునరుద్దరణే లక్ష్యంగా ముందుకెళ్తున్నారన్నారు. అందులో భాగంగా చేపల పిల్లల ఉచిత పంపిణీకి శ్రీకారం  చుట్టారని రామలింగారెడ్డి అన్నారు.